News August 19, 2024

నేటి నుంచి ఇంజినీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్ 

image

ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి చివరి విడత కౌన్సెలింగ్  షెడ్యూల్ ప్రకారం జరగనుంది. ఈ సందర్భంగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ ఆన్‌లైన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈనెల 22 వరకు వెబ్ ఆప్షన్‌కు అవకాశం కల్పించారు. 23న ఆప్షన్లను మార్పు చేసుకోవచ్చు. 26న అలాట్మెంట్లను ప్రకటిస్తారు. 30 లోపు కళాశాలలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది.

Similar News

News September 14, 2024

SKLM: అన్నదాతలకు యూరియా కరవు..!

image

జిల్లాలో 3,41,775 ఎకరాల్లో వరి సాగు చేశారు. రైతుభరోసా కేంద్రాల్లో యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు సుమారు 25,155 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేశారు. వీటిలో యూరియా కేవలం 17వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే. ఎకరా వరి సాగుకు మూడు విడతల్లో 50 కేజీల వరకూ యూరియా వినియోగిస్తారు. ఈ లెక్కన జిల్లాలో సాగుకు సంబంధించి 35వేల మెట్రిక్‌ టన్నుల వరకూ యూరియా అవసరం కాగా రైతుభరోసా కేంద్రాల్లో అరకొరగానే పంపిణీ చేస్తున్నారు.

News September 14, 2024

శ్రీకాకుళం రోడ్డు వరకే ప్రయాణించనున్న మెము రైళ్లు

image

పూండి- నౌపాడ, తిలారు- కోటబొమ్మాళి సెక్షన్ల మధ్య రైల్వే ట్రాక్ భద్రతా పనులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19, 21 తేదీలలో విశాఖ- పలాస మధ్య ప్రయాణించే మెము రైళ్లను(నం.07470, 07471) శ్రీకాకుళం రోడ్డు వరకే నడపనున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్ భద్రతా పనులు జరుగుతున్నందున ఆయా తేదీల్లో శ్రీకాకుళం రోడ్డు- పలాస స్టేషన్ల మధ్య ఈ రైళ్ల రాకపోకలను రద్దు చేశామన్నారు.

News September 14, 2024

శ్రీకాకుళం: ఈ నెల 17 నుంచి స్వచ్ఛతాహి సేవ: కలెక్టర్

image

ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలో స్వచ్ఛతాహి సేవ సేవా కార్యక్రమం నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సంబంధిత శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ప్రజలకు మరింత అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.