News November 14, 2024

నేటి నుంచి ఇంటింటికి సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభం

image

విశాఖలో నేటి నుంచి ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని డిఎంహెచ్ఓ జగదీశ్ అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో కాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంపై వైద్య సిబ్బందితో అవగాహనా శిబిరం నిర్వహించారు.18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్‌ పరీక్షలు చేసి అవసరమగు వారికీ వైద్యం అందిస్తారని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించికోవాలన్నారు.

Similar News

News November 15, 2024

విశాఖ: గోస్తనీలో కారు బోల్తా.. డ్రైవర్ మృతి 

image

తగరపువలస గోస్తని నదిలో కారు బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. వంతెన‌పై అంధకారం నెలకొనడంతో గురువారం రాత్రి కారు అదుపుతప్పి నదిలో బోల్తా పడిన విషయం తెలిసిందే. దీంతో స్థానికులతో పాటు పోలీసులు సహాయకు చర్యలు చేపట్టారు. మృతుడు భోగాపురం ఎయిర్పోర్ట్‌ నిర్మాణ సిబ్బందికి చెందిన డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. మరి కొంతమందిని ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

News November 15, 2024

ఏయూ: ఎం.ఫార్మసీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎం.ఫార్మసీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షలు భాగం అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలలో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేసి ఏయూ వెబ్ సైట్‌లో ఉంచారు. విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 14, 2024

ఏయూ: రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఎంటెక్, ఎంప్లానింగ్ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసి వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు పరీక్షలు విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ నెలలో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేశారు. విద్యార్థులు ఏయూ వెబ్ సైట్ నుంచి తమ రిజిస్ట్రేషన్ (హాల్ టికెట్) నెంబర్ ఉపయోగించి పరీక్షా ఫలితాలను పొందవచ్చును.