News January 31, 2025

నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ: నిర్మల్ DEO

image

నిర్మల్ పట్టణంలోని పంచశీల్ బీఎడ్ కళాశాలలో రెండు రోజులపాటు కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఈవో రామారావు తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు సంబంధించిన ప్రతి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు తరగతులకు హాజరుకావాలన్నారు. ఈ శిక్షణ తరగతులు జనవరి 31, ఫిబ్రవరి1 తేదీల్లో కొనసాగుతాయన్నారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News November 21, 2025

మత్స్యకారులకు అండగా వైసీపీ: జగన్

image

AP: మత్స్యకారులకు తమ పార్టీ అండగా ఉంటుందని YCP అధ్యక్షుడు జగన్ తెలిపారు. ‘సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. వారి సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. రూ.4,913 కోట్లు ల‌బ్ధి చేకూర్చాం’ అని ట్వీట్ చేశారు.

News November 21, 2025

విశాఖ: ప్రేమ.. పెళ్లి.. ఓ తమిళబ్బాయ్..!

image

విశాఖలో ఒక అమ్మాయి కోసం ఇద్దరు యువకుల ఘర్షణ పడగా ఒకరికి గాయాలయ్యాయి. ఓ హోటల్లో పనిచేస్తున్న అమ్మాయి మొదట ఒక తెలుగు యువకుడ్ని ప్రేమించింది. తర్వాత మరో తమిళ యువకుడిని పెళ్లి చేసుకోవడానికి రెఢీ అయ్యింది. దీంతో ఆ ఇద్దరి యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తెలుగు యువకుడు, తమిళ యువకుడుపై కత్తితో దాడి చేసినట్లు అమ్మాయి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో త్రీటౌన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News November 21, 2025

‘హిడ్మాను, మరికొందరిని పట్టుకొని ఎన్కౌంటర్ కథ అల్లారు’

image

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా కామ్రేడ్ రాజేతో పాటు కొంతమందిని విజయవాడలో ఈనెల 15న నిరాయుధంగా ఉన్న సమయంలో పట్టుకుని క్రూరంగా హత్య చేసి మారెడుమిల్లి ఎన్కౌంటర్ కట్టుకథను అల్లారని, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు . AOB రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్‌ను చంపారని అందులో పేర్కొన్నారు.