News January 31, 2025
నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ: నిర్మల్ DEO

నిర్మల్ పట్టణంలోని పంచశీల్ బీఎడ్ కళాశాలలో రెండు రోజులపాటు కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఈవో రామారావు తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు సంబంధించిన ప్రతి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు తరగతులకు హాజరుకావాలన్నారు. ఈ శిక్షణ తరగతులు జనవరి 31, ఫిబ్రవరి1 తేదీల్లో కొనసాగుతాయన్నారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 14, 2025
గోదావరిఖని: ‘పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి’

గోదావరిఖనిలో సింగరేణి సంస్థకు అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సింగరేణి C&MD బలరాంకు వినతి పత్రం ఇచ్చినట్లు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేశ్ తెలిపారు. సింగరేణి పాఠశాలలో CBSE సిలబస్ అప్‌గ్రేడ్ చేయాలని, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి చేయాలని కోరారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ వేతనాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
News February 14, 2025
NZB: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన మహిళ అరెస్ట్

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో మహిళని మావల పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ విష్ణువర్ధన్ వివరాల ప్రకారం.. NZBకు చెందిన స్వరూప అనే మహిళ ADBలోని రాంనగర్‌కు చెందిన సాయితేజకు వెటర్నరీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.50 లక్షలు తీసుకుంది. ఎంతకీ ఉద్యోగం ఇప్పించకపోగా రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తోంది. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News February 14, 2025
యాదాద్రి భువనగిరి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా అశోక్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ నూతన జిల్లా అధ్యక్షుడిగా ఉట్కూరి అశోక్ గౌడ్ నియామకమయ్యారు. తెలంగాణ సంఘటన పర్వ్ 2024 ఎన్నికల నియామవళి ఆధారంగా ఆ పార్టీ ఆయనను నూతన అధ్యక్షుడిగా నియమించింది. రాజపేటకు చెందిన ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి ముప్పై ఏండ్ల నుంచి బీజేపీకి అనేక సేవలు అందించారు. అశోక్ గౌడ్ నూతన అధ్యక్షుడిగా నియామకం కావడంతో జిల్లా వ్యాప్తంగా ఆయనకు పార్టీ నేతలు అభినందనలు తెలుపుతున్నారు.