News September 30, 2024
నేటి నుంచి ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అవకాశం: కలెక్టర్

ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన వారు ఈనెల 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్ లైన్, ఏఈఆర్ఓ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పట్టభద్రుల ఓటర్లు ఫారం నెంబర్- 18, ఉపాధ్యాయ ఓటర్లు ఫారం నెంబర్- 19లో దరఖాస్తు చేయాలని తెలిపారు.
Similar News
News October 17, 2025
నర్సాపూర్: ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్

నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ సస్పెండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించాలన్న సమాచారంతో విచారణ చేపట్టిన డీఈవో వారిని గురువారం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
News October 16, 2025
మెదక్: 49 మద్యం దుకాణాలు.. 276 దరఖాస్తులు

మెదక్ జిల్లాలోని మొత్తం 49 మద్యం దుకాణాలకు బుధవారం వరకు 276 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి జి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మద్యం దుకాణాలు ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు రిజర్వేషన్ కేటాయించినట్లు తెలిపారు. సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
News October 15, 2025
MDK: ‘రూల్స్ పాటించకపోతే చర్యలే’

ప్రతి దీపావళికి జిల్లాలో 250 వరకు టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తారు. మెదర్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ తదితర ఏరియాల్లో భారీగా వెలుస్తాయి. అయితే దుకాణాల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఏర్పాట్లు చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో టపాసుల షాపులను నిబంధనల మేరకే ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు.