News August 25, 2024
నేటి నుంచి ఏలూరులో వందే భారత్‌కు హాల్ట్
విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నేటినుంచి ఏలూరులో అదనపు హాల్ట్ కల్పించనున్నారు. ఈరోజు సాయంత్రం వందే భారత్ రైలు విశాఖ నుంచి బయలుదేరి ఏలూరుకు 5:54కి రానుంది. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ వేడుకకు రైల్వే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌తోపాటు రైల్వే అధికారులు, ప్రజలు పాల్గొననున్నారు.
Similar News
News September 13, 2024
పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.3.07కోట్లు మంజూరు
జిల్లాలో పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీలు కింద రూ.3.07కోట్లు మంజూరు చేయడం జరిగిందని ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని శుక్రవారం వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించారు. సింగిల్ విండో పథకం కింద అనుమతులను కాలయాపన లేకుండా మంజూరు చేయాలని ఆదేశించారు. ఓఎన్‌డీసీ ప్లాట్ ఫామ్‌లో అన్ని ఎంఎస్ఎంఈ యూనిట్లు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
News September 13, 2024
17న నులిపురుగుల నిర్మూలన నివారణ దినోత్సవం
జిల్లాలో ఈ నెల 17వ తేదీన నులిపురుగుల నిర్మూలన నివారణ దినోత్సవంగా నిర్వహించనున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం నులిపురుగుల నివారణ, ఆల్బెండ్జోల్ మాత్రలు అవశ్యకతకు సంబంధించి ప్రచార వీడియోలు, కరపత్రాలను ఆవిష్కరించారు. 19 ఏళ్ల లోపు వారికి నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు.
News September 13, 2024
‘ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరగాలి’
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం గోదావరి సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, సంబధిత అధికారులతో ఆమె సమీక్షించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సుమారు 5.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని అంచనా ఉండగా అందులో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు పటిష్ఠ ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు.