News December 6, 2024
నేటి నుంచి కాకినాడ జిల్లాలో రెవెన్యూ సదస్సులు

గ్రామాల్లో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం కాకినాడ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025 జనవరి 8వ తేదీ వరకు గ్రామాల్లో సదస్సులు కొనసాగుతాయని చెప్పారు. భూ సమస్యలు ఉన్న రైతులు అర్జీలు అందజేసి పరిష్కరించుకోవాలని సూచించారు.
Similar News
News October 15, 2025
RJY: నవంబర్ 3 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె

నవంబర్ 3 నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాకు ఆయన సమ్మె నోటీసు అందజేశారు. కమిషనర్కు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే ఈ సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
News October 14, 2025
దీపావళి నేపథ్యంలో భద్రతా చర్యలు తప్పనిసరి: కలెక్టర్

దీపావళి పండుగ సందర్భంగా అనుమతులు, భద్రతా చర్యల విషయంలో సంబంధిత అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. టపాసుల హోల్సేల్ స్టాక్ షెడ్లు, తాత్కాలిక దుకాణాలకు వచ్చే దరఖాస్తులను రెవెన్యూ, పోలీస్, ఫైర్ శాఖల త్రిసభ్య కమిటీ ద్వారా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు.
News October 13, 2025
రాజమండ్రిలో యువ హీరో సందడి

అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రంగా ‘కె – ర్యాంప్’ రూపొందిందని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. సినిమా ప్రమోషన్ నిమిత్తం ఆయన సోమవారం రాజమండ్రి వచ్చారు. జైన్స్ నాని దర్శకత్వంలో, హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం దీపావళి రోజున విడుదల కానుందని చెప్పారు. సినిమా ఆద్యంతం వేగంగా, స్పీడుగా నడుస్తుందనే ఉద్దేశంతోనే ‘ర్యాంప్’ అనే పేరు పెట్టామని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.