News May 18, 2024
నేటి నుంచి కాచిగూడ రైలు పునరుద్ధరణ
గుంటూరు నుంచి కాచిగూడ వెళ్లే రైలు(17251)ను ఈనెల 18 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు మండల రైల్వే అధికారి శుక్రవారం తెలిపారు. అదేవిధంగా కాచిగూడ నుంచి గుంటూరు వచ్చే రైలు (17252) ఈనెల 19వ తేదీ నుంచి నడుస్తుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున ఈ రెండు రైళ్లను ఈనెల 31 వరకు రద్దు చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.
Similar News
News December 9, 2024
తాడేపల్లిలో మహిళపై అత్యాచారయత్నం
తాడేపల్లిలో ఓ మహిళపై ఆదివారం రాత్రి అత్యాచారయత్నం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తన కుమారుడి స్నేహితుడు రామారావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో సదరు మహిళ భయంతో మాజీ CM జగన్ హెలీప్యాడ్ వైపు పరుగులు తీసింది. స్థానికుల సహాయంతో ఆ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News December 9, 2024
పల్నాడు: ఆ నలుగురి చివరి ఫొటో ఇదే..!
పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలి పట్టణ వాసులు నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆంజనేయస్వామి మాల వేసుకున్న వీరంతా తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా కారు చెట్టు ఢీకొని చనిపోయారు. కొండగట్టులో వాళ్లు తీసుకున్న చివరి ఫొటో ఇదే. ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు కన్నుమూయడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు.
News December 9, 2024
ఎన్జీవో కాలనీలో NTR విగ్రహావిష్కరణ చేసిన పెమ్మసాని
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎన్జీఓ కాలనీలో ఆదివారం సాయంత్రం టీడీపీ వ్యవస్థాపకుడు NTR విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర సహాయమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గళ్ళా మాధవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.