News October 25, 2024

నేటి నుంచి కృష్ణాజిల్లాలో పశుగణన : కలెక్టర్

image

ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా పశు గణన చేపట్టనున్నట్టు కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికలను గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 25వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 28వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల్లో పశు సంవర్ధక శాఖ సిబ్బందిచే పశుసంపద లెక్కింపు కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు.

Similar News

News March 1, 2026

అడ్డంకులు అధిగమించి పరిశ్రమలు నెలకొల్పాలి: కలెక్టర్

image

జిల్లాలో మంజూరైన పరిశ్రమల యూనిట్లను సత్వరమే నెలకొల్పేందుకు ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే తొలగించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరిశ్రమల అధికారులు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి మంజూరైన 230 పరిశ్రమల యూనిట్ల పురోగతిపై యూనిట్ల వారీగా సమీక్షించారు.

News February 28, 2026

కృష్ణాజిల్లాలో 91.26% మేర పెన్షన్ల పంపిణీ

image

కృష్ణాజిల్లాలో తొలి రోజు 91.26% మేర పెన్షన్ల పంపిణీ జరిగిందని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరి హరనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 2,32,715 పెన్షన్లకు గాను, 2,12,375 పెన్షన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. 92,38,80,000 మేర పెన్షన్ సొమ్మును అందజేశామన్నారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో అందజేస్తామన్నారు.

News February 28, 2026

కృష్ణా: జిల్లాలో 124 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సరం వృక్ష శాస్త్రము, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 63 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 7,374 మంది విద్యార్థులకు 7,293 మంది హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సరళాదేవి తెలిపారు. 124 మంది గైర్హాజరయ్యారని, పరీక్ష సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.