News October 25, 2024
నేటి నుంచి కృష్ణాజిల్లాలో పశుగణన : కలెక్టర్
ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా పశు గణన చేపట్టనున్నట్టు కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికలను గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 25వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 28వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల్లో పశు సంవర్ధక శాఖ సిబ్బందిచే పశుసంపద లెక్కింపు కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు.
Similar News
News November 9, 2024
ఎన్టీఆర్: DSC పరీక్షకు సిద్ధమయ్యే వారికి ముఖ్యగమనిక
DSC, SGT పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికై అభ్యర్థులు ఈ నెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ స్టడీ సర్కిల్ ఎన్టీఆర్ జిల్లా డైరెక్టర్ కె. శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, టెట్ మార్క్స్ లిస్ట్‌తో పండరీపురం రోడ్ నం.8, అశోక్‌నగర్‌లోని స్టడీ సర్కిల్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన అభ్యర్థులకు శిక్షణతో పాటు స్టైఫండ్ ఇస్తామన్నారు.
News November 9, 2024
ఇంటి వద్దే ఈకేవైసీ నమోదు: నిధి మీనా
ఉచిత గ్యాస్ సిలిండర్‌కు అర్హులైన వినియోగదారులకు వారి ఇంటి వద్దే గ్యాస్ డెలివరీ బాయ్స్‌చే ఈకేవైసీ నమోదు చేసుకునే సదుపాయం ఉందని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకానికి బియ్యం కార్డు, గ్యాస్ కనెక్షన్, అధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు అర్హులన్నారు. వినియోగదారులు తమ మొదటి ఉచిత సిలిండర్‌ను గ్యాస్ ఏజెన్సీలో మార్చిలోపు బుక్ చేసుకోవచ్చన్నారు.
News November 8, 2024
ఇంటి వద్దే ఈకేవైసీ నమోదు: నిధిమీనా