News December 2, 2024
నేటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

కొత్త రేషన్ కార్డులకు నేటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ మేరకు అర్హుల నుంచి సచివాలయ సిబ్బంది దరఖాస్తులను స్వీకరించనున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 6.50 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. వీరందరూ మార్పులు, చేర్పులు ఈ నెల 28లోపు చేసుకోవచ్చు. ఇప్పటికే కొత్త కార్డుల దరఖాస్తులు 12 వేలకు పైగా పెండింగ్లో ఉన్నాయి. త్వరలో ప్రభుత్వం అర్హులందరికీ కొత్తకార్డులు మంజూరు చేయనుంది.
Similar News
News November 16, 2025
కన్నా లేవారా.. కన్నీటి రోదన మిగిల్చిన నీటి కుంట

కళ్లెదుట ఉన్న పిల్లలు నీటి కుంటలో పడి కానారాని లోకాలకెళ్లారని కన్నవారు జీర్ణించుకోలేకపోయారు. కన్నా..లేవరా అంటూ..చిన్నారుల మృతదేహాలపై పడి కన్నవారి కన్నీటి రోదనకు..ఊరంతా వేదనలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి(M) పంటిగుంటకు చెందిన అవినాష్(9), సుధీర్(8)లు ఆదివారం సాయంత్రం నీటి కుంటలో స్నానానికి దిగి ..ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. దీనిపై SI సింహాచలం కేసు నమోదు చేశారు.
News November 16, 2025
మరోసారి ఐపీఎల్కు సిక్కోలు యువకుడు

ఐపీఎల్-2026లో సిక్కోలు యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ మరోసారి మెరువనున్నాడు. టెక్కలికి చెందిన విజయ్ను రూ.30లక్షలకు రిటైన్ చేసుకున్నట్లు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో రానున్న ఐపీఎల్ సీజన్లో విజయ్ ఆడనున్నాడు. గత కొన్నేళ్లుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయ్ శిక్షణ పొందుతూ పలు కీలక క్రికెట్ టోర్నీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు.
News November 16, 2025
SKLM: బంగారమంటూ పిలిచి.. బురిడీ కొట్టించాడు

ప్రేమిస్తున్నాని..పెళ్లి చేసుకుందామని ఆ యువతిని కుర్రాడు నమ్మించాడు. బంగారమంటూ పిలిస్తే..మురిసిపోయిందేమో యువకుడితో పెళ్లికి సిద్ధమైంది. శ్రీకాకుళానికి చెందిన వీరిద్దరూ HYDకు ఈనెల14న బయలుదేరారు. VJAలో బస్సు మారే క్రమంలో నగల బ్యాగ్, ఫోన్తో పారిపోయాడు. చావే దిక్కని ఏడుస్తున్న ఆమెను కృష్ణలంక పోలీసులు ప్రశ్నిస్తే విషయం తెలిసింది. దర్యాప్తు చేసి నగలతోపాటు యువతిని పేరెంట్స్కు నిన్న అప్పగించారు.


