News December 2, 2024
నేటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

కొత్త రేషన్ కార్డులకు నేటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ మేరకు అర్హుల నుంచి సచివాలయ సిబ్బంది దరఖాస్తులను స్వీకరించనున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 6.50 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. వీరందరూ మార్పులు, చేర్పులు ఈ నెల 28లోపు చేసుకోవచ్చు. ఇప్పటికే కొత్త కార్డుల దరఖాస్తులు 12 వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో ప్రభుత్వం అర్హులందరికీ కొత్తకార్డులు మంజూరు చేయనుంది.
Similar News
News April 17, 2026
ఎచ్చెర్ల: చేపల వేటకు బ్రేక్.. తీరాల్లో నిశ్శబ్దం!

చేపల వేటపై రెండు నెలల నిషేధం అమల్లోకి రావడంతో జిల్లాలోని సముద్ర తీరాలు నిర్మానుష్యంగా మారాయి. ఎచెర్ల మండలంలోని డి.మత్స్యలేశం గ్రామంలో మత్స్యకారులు బోట్లను, వలలను ఒడ్డున సురక్షితంగా ఉంచి ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతి ఏడాది చేపల ప్రత్యుత్పత్తి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
News April 17, 2026
శ్రీకాకుళం జిల్లాలో 18న జాబ్ మేళా

జాబ్ మేళా వివరాలు ఇవే:
మిడ్ ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్, ఐ స్మార్ట్ సొల్యూషన్స్, అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్‌లో పని చేసేందుకు ఇంటర్, ఐటీఐ, డిప్లోమో, ఆపై చదివి ఉండాలన్నారు. పోస్టుల మేరకు 18-35 ఏళ్లు కలిగి ఉండాలన్నారు. ఎంపికైన వారు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలో పనిచేయాలన్నారు. రూ.8-35 వేల జీతం ఇవ్వనున్నారు.