News September 7, 2024
నేటి నుంచి ఖైరతాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలు ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు నుంచి విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు అంటే ఈనెల 17వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి పూజా కార్యక్రమాలు పూర్తయ్యే వరకు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సిటీ ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని ఆయన కోరారు.
Similar News
News October 31, 2025
జూబ్లీహిల్స్: రోజుకు 2 డివిజన్లలో సీఎం ప్రచారం

సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. రోజుకు 2 డివిజన్ల చొప్పున 3 విడతలుగా ప్రచారం సాగనుంది. PJR సర్కిల్ నుంచి జవహర్నగర్ మీదుగా సాయిబాబా టెంపుల్ (చాకలి ఐలమ్మ విగ్రహం) వరకు రోడ్ షో.సాయిబాబా టెంపుల్ ఆవరణలో కార్నర్ మీటింగ్లో ప్రసంగం, సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ మార్కెట్ ఏరియా వద్ద మరో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు.
News October 31, 2025
డాక్టర్స్ స్పెషల్: ఎల్బీస్టేడియంలో టెన్నిస్ టోర్నమెంట్

ఎప్పుడూ రోగులు, వైద్యం అంటూ బిజీ బిజీగా ఉండే వైద్యులు ఈ వీకెండ్ సేదతీరనున్నారు. టెన్నిస్ టోర్నమెంటులో పాల్గొని రిలాక్స్ కానున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు డాక్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డా.అర్జున్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్యులు సందడి చేయనున్నారు.
News October 31, 2025
HYD: రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట జరుగకుండా చర్యలు

పండగలు, ప్రత్యేక రోజుల్లో సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్లకు ప్రయాణికులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఒక్కోసారి రద్దీ ఎక్కువై అదుపుతప్పి తొక్కిసలాట జరుగుతుంది. ఈ ప్రమాదాలు జరుగకుండా రైల్వే శాఖ కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు హోల్డింగ్ ఏరియాలను త్వరలో ఏర్పాటు చేయనుంది. ఇవి అందుబాటులోకి వస్తే తోసుకోవడం, తొక్కిసలాట సమస్యలు ఉండవని అధికారులు చెబుతున్నారు.


