News February 1, 2025

నేటి నుంచి జిల్లాలో పోలీసు యాక్ట్: ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్‌-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్‌ తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లీక్‌ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.

Similar News

News November 8, 2025

తాంసి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP

image

వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తాంసి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. పోలీసు గౌరవ ప్రతిష్టలు పెంచేలా విధులు నిర్వహించాలన్నారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

News November 8, 2025

జూబ్లీ బైపోల్: మాగంటి మరణం చుట్టూ రాజకీయం

image

చావు కూడా రాజకీయాలకు అతీతం కాదని ప్రస్తుత జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం నిరూపిస్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ అని, దానిని ఛేదించాలని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం మరో ముందడుగు వేసి ఈ విషయంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుందని పేర్కొన్నారు. దీంతో బైపోల్ పాలిటిక్స్ పీక్ స్థాయికి చేరుకున్నాయి.

News November 8, 2025

ఎడ్యుకేషనల్ హబ్‌గా కుప్పం: సీఎం చంద్రబాబు

image

AP: కుప్పంలో రూ.2,203కోట్ల పెట్టుబడితో 7 సంస్థల ఏర్పాటుకు CM చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కుప్పంను ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తాం. ప్రైవేట్, రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రోత్సహిస్తాం. ఇప్పటికే యూనివర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి’ అని తెలిపారు. కుప్పంలో ల్యాప్‌టాప్, మొబైల్ యాక్సెసరీస్ వంటి 7 సంస్థలకు ప్రభుత్వం 241 ఎకరాలు కేటాయించింది.