News February 1, 2025

నేటి నుంచి జిల్లాలో పోలీసు యాక్ట్: ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్‌-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్‌ తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లీక్‌ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.

Similar News

News February 19, 2025

ఢిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ

image

ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కేంద్ర పరిశీలకులు భేటీ అయ్యారు. కాసేపట్లో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. కొత్త సీఎం రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

News February 19, 2025

దామరచర్ల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. పరిసరాలు, వంటగది, తరగతి గదులు, మరుగు దొడ్లు పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను తనిఖీ చేశారు. నెలలోపు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

News February 19, 2025

WGL: ‘స్మార్ట్ సిటీ పనులను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలి’

image

స్మార్ట్ సిటీ పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూసీ పరిధిలోస్మార్ట్ సిటీ పథకం కింద కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టీచర్స్ కాలనీ ఫేజ్-1లో సీసీ రోడ్‌ను, వడ్డేపల్లి బండ్‌పై కొనసాగుతున్న అభివృద్ధి పనులు, 52వ డివిజన్ రాజాజీ నగర్ కల్వర్టు ఇతర పనులను పరిశీలించారు.

error: Content is protected !!