News August 4, 2024
నేటి నుంచి జీడి పరిశ్రమలు ఓపెన్
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ, పరిసర ప్రాంతాల్లో ఉన్న జీడి పరిశ్రమలను ఆదివారం నుంచి తెరుస్తున్నామని పలాస పారిశ్రామికవాడ జీడి పరిశ్రమల సంఘ అధ్యక్షుడు మల్లా రామేశ్వరం వెల్లడించారు. జులై 19వ తేదీ నుంచి జీడి ఉత్పత్తులు పేరుకుపోవడంతో పరిశ్రమలు తాత్కాలికంగా బంద్ చేశామని చెప్పారు. ఆదివారం నుంచి బాయిలింగ్, కటింగ్ కొనసాగుతాయని స్పష్టం చేశారు.
Similar News
News September 14, 2024
శ్రీకాకుళం రోడ్డు వరకే ప్రయాణించనున్న మెము రైళ్లు
పూండి- నౌపాడ, తిలారు- కోటబొమ్మాళి సెక్షన్ల మధ్య రైల్వే ట్రాక్ భద్రతా పనులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19, 21 తేదీలలో విశాఖ- పలాస మధ్య ప్రయాణించే మెము రైళ్లను(నం.07470, 07471) శ్రీకాకుళం రోడ్డు వరకే నడపనున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్ భద్రతా పనులు జరుగుతున్నందున ఆయా తేదీల్లో శ్రీకాకుళం రోడ్డు- పలాస స్టేషన్ల మధ్య ఈ రైళ్ల రాకపోకలను రద్దు చేశామన్నారు.
News September 14, 2024
శ్రీకాకుళం: ఈ నెల 17 నుంచి స్వచ్ఛతాహి సేవ: కలెక్టర్
ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలో స్వచ్ఛతాహి సేవ సేవా కార్యక్రమం నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సంబంధిత శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ప్రజలకు మరింత అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News September 14, 2024
SKLM: పలాస జీడిపప్పు .. శ్రీనివాసుడి చెంతకు..!
అంతర్జాతీయ స్థాయిలో పలాస ఉద్దానం జీడిపప్పు నోరురుంచేది. ఇప్పుడు TTD ప్రసాదం లడ్డూ రూపంలో యాత్రికుల చెంతకు చేరనుంది. జాతీయ స్థాయిలో తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి వినియోగించే వస్తువుల్లో జీడిపప్పు కూడా ప్రధాన భూమిక పోషిస్తోంది. ఇకపై ఈ లడ్డూలో పలాస జీడిపప్పుకు స్థానం దక్కనుంది. ఇటీవల టెండర్లు వేయగా పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోష్ TTDకి జీడిపప్పు సరఫరా చేసే భాగ్యం లభించింది.