News July 28, 2024

నేటి నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ప్రారంభం

image

నేటి నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కర్నూలులోని సనత్ నగర్ అయాన్ డిజిటల్ కేంద్రంలో డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని, పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్ఓ మధుసూదన్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష ఉదయం, మధ్యాహ్నం జరగనుంది. బేర్ యాక్ట్స్ పుస్తకాలు, గుర్తింపు కార్డులు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.

Similar News

News November 13, 2025

మందు బాబులకు కర్నూలు ఎస్పీ హెచ్చరిక

image

కర్నూలు జిల్లాలో బహిరంగంగా మద్యం తాగి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రోడ్లు, నడక దారులు, పార్కులు, వ్యాపార సముదాయాల వద్ద ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

News November 12, 2025

రాయలసీమ వర్సిటీలో 4వ స్నాతకోత్సవం

image

కర్నూలు నగర శివారులోని రాయలసీమ యూనివర్సిటీలో బుధవారం 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

News November 12, 2025

ఈనెల 14న ఉమ్మడి జిల్లాస్థాయి విలువిద్య ఎంపిక పోటీలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లా విలువిద్య ఎంపిక పోటీలను కర్నూలు ఔట్ డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి కె.నాగరత్నమయ్య బుధవారం తెలిపారు. అండర్-21 బాలబాలికల విభాగంలో ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు కృష్ణా(D) నూజివీడులో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని వెల్లడించారు.