News April 10, 2025

నేటి నుంచి పాలిసెట్ శిక్షణ తరగతులు ప్రారంభం

image

పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇల్లందు సింగరేణి కాలరీస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో నేటి నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణను స్థానిక విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News December 5, 2025

నా ఓరుగల్లు.. కాకతీయులు ఏలిన నేల!

image

కాకతీయులు ఏలిన ఓరుగల్లు గడ్డపై పుట్టిన బిడ్డలు ప్రపంచంలో ఎక్కడున్నా తమ నేలను మర్చిపోరు. ఈ నేలపై ఓరుగల్లు ప్రజలు చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు. ఎక్కడ కలుసుకున్నా జిల్లా బంధం ఇట్టే కలిపేస్తుంది. ఎక్కడున్నా ఓరుగల్లు భాష దగ్గరికి చేరుస్తుంది. అంతేకాదు.. ఓరుగల్లును, పంట భూములను భద్రకాళి, సమ్మక్క-సారలమ్మ, రుద్రేశ్వర స్వామి వార్లే కాపాడతారని ఇక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. నేడు ప్రపంచ నేల దినోత్సం. SHARE

News December 5, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీగా తగ్గిన సిల్వర్ రేటు!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా.. సిల్వర్ రేటు భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి రూ.1,29,930కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 ఎగబాకి రూ.1,19,100 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.4,000 తగ్గి రూ.1,96,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 5, 2025

నల్గొండ: కబడ్డీ అసోసియేషన్‌లో లుకలుకలు!

image

నల్గొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌లో లుకలుకలు బయటపడ్డాయి. కబడ్డీ అసోసియేషన్‌లో ఆంధ్రా ప్రాంత ఉద్యోగి పెత్తనం చెలాయించడంపై అసోసియేషన్‌ మండిపడుతోంది. జిల్లా కమిటీ సభ్యులకు తెలియకుండానే జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ పేరుతో ఈనెల 2, 3, 4వ తేదీల్లో హాలియాలో 51వ అంతర్‌ జిల్లాల బాలికల కబడ్డీ పోటీలు నిర్వహించారు. హాలియాలో నిర్వహించిన కబడ్డీ పోటీలకు కబడ్డీ అసోసియేషన్‌తో సంబంధం లేదని సభ్యులు తెలిపారు.