News July 8, 2024
నేటి నుంచి పిన్నెల్లి విచారణ

మాచర్ల YCP మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సోమవారం నుంచి పోలీసులు విచారించనున్నారు. పోలింగ్ రోజు పాల్వాయిగేట్లో ఈవీఎం ధ్వంసం, TDP ఏజెంట్ శేషగిరిరావుపై దాడి, కారంపూడిలో అల్లర్లు, సీఐ నారాయణస్వామిపై దాడికి సంబంధించి ఆయన్ను విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ, రేపు (8, 9 తేదీల్లో) నెల్లూరు జైలులోనే ఆయన విచారణ జరగనుంది. విచారించేటప్పుడు వీడియో తీయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
Similar News
News November 21, 2025
Way2Newsలో వార్త.. నేడు మంత్రి పర్యటన

రాజధాని గ్రామాల్లో గత ప్రభుత్వంలో నిర్మించిన వెల్నెస్ సెంటర్లు నిరుపయోగంగా ఉన్నాయంటూ ఈ నెల 18వ తేదీన Way2Newsలో వార్త పబ్లిష్ అయ్యింది. స్పందించిన మంత్రి నారాయణ శుక్రవారం ఉదయం 8 గంటలకు రాజధాని గ్రామాల్లో CITIIS ప్రాజెక్ట్ కింద చేపట్టిన అంగన్వాడీ సెంటర్లు, స్కూల్స్, హెల్త్ సెంటర్లను పరిశీలించనున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరి కాసేపట్లో మంత్రి పర్యటన అప్డేట్ Way2Newsలో చూడొచ్చు.
News November 21, 2025
గుంటూరులోని ఈ బాలుడు మీకు తెలుసా?

గుంటూరు రైల్వేస్టేషన్ తూర్పు గేటు పార్కింగ్ వద్ద నవంబర్ 18న ఉదయం 8 గంటలకు మూడేళ్ల బాలుడు ఏడుస్తూ ఒంటరిగా దొరికాడు. తల్లిదండ్రుల ఆచూకీ లభించకపోవడంతో ఆర్పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు బాలుడిని కొత్తపేట పోలీసుల ద్వారా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలుడు తన వివరాలు చెప్పలేకపోతున్నాడు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు తనను 8688831320 నంబర్లో సంప్రదించాలని కొత్తపేట సీఐ కోరారు.
News November 21, 2025
గుంటూరు: డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

గుంటూరు జిల్లా వ్యాప్తంగా DEC 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. సివిల్, రాజీ పడదగ్గ క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ ప్రమాద బీమా, చెక్ బౌన్స్, LAOP, ప్రీ-లిటిగేషన్ కేసులపై ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కక్షిదారులు, పోలీసులు, స్టేక్హోల్డర్లు ఎక్కువ కేసులు రాజీ చేసుకునేందుకు సహకరించాలన్నారు.


