News June 24, 2024

నేటి నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రారంభం

image

విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో సోమవారం నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రారంభం కానుందని, విశాఖపట్నం ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో వినతుల స్వీకరణ కార్యక్రమం మొదలవుతుందని, అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News January 2, 2025

డిప్యూటీ సీఎంకు చటకంభ గ్రామస్థుల విన్నపం 

image

అల్లూరి జిల్లా పెదకోట పంచాయతీ కేంద్రం నుంచి సుమారు నాలుగు కిలోమీటర్లు దూరంలో చటకంభ ఉంది. గ్రామంలో 240 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఆ  గ్రామం మీదుగా 30 గ్రామాలున్నాయి. 15 సంవత్సరాలు క్రితం వేసిన మట్టిరోడ్డు ఇటీవల కురిసిన వర్షాలు కారణంగా కొట్టుకుపోయింది. దీంతో తారురోడ్డు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, అల్లూరి జిల్లా కలెక్టర్‌‌ను ఆ గ్రామస్థులు విన్నవించుకున్నారు. 

News January 2, 2025

యర్రాజీకి విశాఖ ఎంపీ అభినందనలు

image

విశాఖ నగరానికి చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ అర్జున అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఆమెను ఎంపీ భరత్ సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విశాఖ నుంచి అర్జున అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News January 2, 2025

జ్యోతి మరిన్ని లక్ష్యాలను సాధించాలి: శాప్ ఛైర్మన్

image

విశాఖ నగరానికి చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ అర్జున అవార్డుకు ఎంపిక కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం అని శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఆమె పట్టుదల అంకితభావాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. భవిష్యత్తులో జ్యోతి మరిన్ని లక్ష్యాలను సాధించి యువతకు స్ఫూర్తిని ఇవ్వాలన్నారు. అర్జున అవార్డుకు ఎంపికైన ఆమెను ఆయన అభినందించారు.