News June 24, 2024
నేటి నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రారంభం
విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో సోమవారం నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రారంభం కానుందని, విశాఖపట్నం ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో వినతుల స్వీకరణ కార్యక్రమం మొదలవుతుందని, అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 5, 2024
కలెక్టర్‌తో మాల్దీవుల ప్రజాప్రతినిధుల భేటీ
విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా పలువురు మాల్దీవుల ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌తో భేటీ అయ్యారు. విజ్ఞానయాత్రలో భాగంగా సోమవారం పెందుర్తి, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వారు పలు పరిపాలనాపరమైన అంశాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌తో సమావేశం అయ్యారు. పలు అంశాలపై ఆయనతో వారు చర్చించారు.
News November 4, 2024
SGF రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో విశాఖ జట్టుకు ప్రథమ స్థానం
తుమ్మపాలలో మూడు రోజులపాటు జరిగిన 68వ SGF రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో బాల,బాలికల విభాగాల్లో విశాఖ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. బాలుర ఖోఖో పోటీల్లో విశాఖ జట్టు ప్రథమ, ప్రకాశం జట్టు ద్వితీయ, కృష్ణ జట్టు తృతీయ స్థానాలు సాధించింది. బాలికల ఖోఖో పోటీల్లో విశాఖ జట్టు ప్రథమ, నెల్లూరు జట్టు ద్వితీయ, తూర్పుగోదావరి జట్టు తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి.
News November 4, 2024
అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి: ఎమ్మెల్సీ
ఏపీపీఎస్ కు సంబంధించి గ్రూప్ 1,2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని చైర్ పర్సన్ అనురాధకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడలో ఆమెకు వినతిపత్రం అందజేశారు. గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష అర్హుల జాబితాను 1:100 నిష్పత్తికి పెంచాలన్నారు. గ్రూప్-2 మెయిన్ పరీక్షకు కనీసం 90 రోజులు వ్యవధి ఉండేలా చూడాలన్నారు.