News November 1, 2024
నేటి నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు

తెలంగాణ ప్రజల ఇలవేల్పు, పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న కురుమూర్తి వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మో త్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి యాగశాల, ఉత్సవాల్లో ప్రధానమైన కల్యాణోత్సవం 2న, అలంకారోత్సవం 6న, ఉద్దాలోత్సవం 8న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News December 16, 2025
MBNR: ఫేస్-3..సిబ్బందికి ఎస్పీ డి.జానకి సమగ్ర బ్రీఫింగ్

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా బుధవారం జరగనున్న గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం జడ్చర్ల మండల కేంద్రంలో BRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఎన్నికల బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డి.జానకి సమగ్ర బ్రీఫింగ్ నిర్వహించారు.
News December 16, 2025
MBNR: 145 గ్రామాలు, 212 పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు: ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లా మొత్తం మూడో విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో 145 గ్రామాల్లో 212 పోలింగ్ కేంద్రాలు, 1254 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 44 సమస్యాత్మక గ్రామాల్లో 52 పోలింగ్ కేంద్రంలో 394 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఎస్పీ డి.జానకి వివరించారు. భద్రతా చర్యల్లో భాగంగా 44 రూట్ మొబైల్స్, 16 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (FST), 5 స్ట్రైకింగ్ ఫోర్సులు, 5 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు మోహరించినట్లు తెలిపారు.
News December 16, 2025
MBNR: సౌత్ జోన్.. ఈనెల 19న టేబుల్ టెన్నిస్ ఎంపికలు

మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపికలను ఈ నెల 19న నిర్వహించనున్నట్లు వర్సిటీ పీడీ డా. వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. వయస్సు 17-25 ఏళ్లలోపు ఉండాలని, క్రీడాకారులు బోనఫైడ్, టెన్త్ మెమో, ప్రిన్సిపల్ సంతకంతో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్ తీసుకురావాలన్నారు. ఎంపికలు యూనివర్సిటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉంటాయన్నారు.


