News September 20, 2024

నేటి నుంచి మంత్రి ఆనం నెల్లూరు జిల్లా పర్యటన

image

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి 26వ తేదీ వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 20న చేజర్ల మండలం మాముడూరు, 21 సంగం మండలం జండాదిబ్బ, 22న ఏఎస్పేట హస్నాపురం, 23న ఆత్మకూరు మున్సిపాలిటీ పేరారెడ్డిపల్లి, 24న అనంతసాగరం, లింగంగుంట, 25న మర్రిపాడు, తిక్కవరం, 26న ఆత్మకూరు, చెర్లో ఎడవల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు.

Similar News

News October 5, 2024

నెల్లూరు: ఏఎంసీల నియామకాలకు సన్నాహాలు

image

ఏఎంసీ పాలకవర్గాల నియామకానికి కసరత్తు మొదలైంది. జిల్లాలో నెల్లూరు సిటీ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలకు వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకం చేపట్టాల్సి ఉంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు సన్నాహాలు చేపట్టారు. ఛైర్మన్లు, సభ్యుల నియామకానికి వడపోతల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. జనసేన, బీజేపీ నేతలు కూడా కొన్ని పదవులు ఆశిస్తున్నారు. కాగా నెల్లూరు రూరల్‌కు సంబంధించి మనుబోలు శ్రీధర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది.

News October 5, 2024

నెల్లూరు: విభిన్న ప్రతిభావంతుల రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు 100 మంది దివ్యాంగుల లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయనున్నట్లు ఆ శాఖ ఏడీ ఎం. వినయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన దివ్యాంగులు రుణ మంజూరు వివరాలు దరఖాస్తు పత్రాలు షూరిటీ వివరములు నిర్ణీత ఫార్మాట్లో జిల్లా వెబ్సైటు లో పొందుపరచబడి ఉన్నాయని తెలిపారు. దరఖాస్తులను కార్యాలయంలో సమర్పించాలని కోరారు.

News October 5, 2024

పీఎం కిసాన్ ద్వారా 1,67,247 రైతులకు లబ్ధి: జేడీ

image

నెల్లూరు జిల్లాకు పీఎం కిసాన్ 18వ విడత నిధులు విడుదలైనట్లు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యవాణి తెలిపారు. దీని వల్ల జిల్లాలోని 1,67,247 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆయా రైతుల అకౌంట్లో ఒక్కొక్కరికి రూ. 2 వేలు చొప్పున జమ అవుతాయన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాకు రూ.33.40 కోట్లు విడుదలైనట్టు జేడీ పేర్కొన్నారు.