News April 15, 2025
నేటి నుంచి మలేరియా స్ప్రేయింగ్ పిచికారీ: జిల్లా కలెక్టర్

ఈనెల 15వ తేదీ మంగళవారం నుంచి మలేరియా నివారణకు మొదటి విడత దోమల మందు (ఏసీఎం 5%) పిచికారి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను సోమవారం ఆదేశించారు. జిల్లాలోని మూడు ఐటీడీఏల పరిధిలో గల 22 మండలాల్లో, 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోగల 311 సచివాలయాల ప్రాంతాల్లోని 2,086 ఎంపిక చేసిన గ్రామాల్లో 5.16 లక్షల జనాభా లక్ష్యంగా పిచికారి కార్యక్రమం ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News July 11, 2025
జనాభా లెక్కల్లోనూ రంగారెడ్డి జిల్లా తగ్గేదేలే!

రంగారెడ్డి జిల్లాలో జనాభా శరవేగంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 24,46,265 మంది ఉండగా.. వీరిలో 12,54,184 మంది పురుషులు,11,92,081 మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్‌లో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 35,23,219కు చేరింది. జిల్లా పరిశ్రమలతో పాటు రియల్ ఎస్టేట్ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో 13 ఏళ్లలో జనాభా 48 లక్షలకు చేరిందని అంచనా.
News July 11, 2025
MBNR: పల్లె పోరు.. రిజర్వేషన్ల ఫీవర్

ఆగస్టు నెలాఖరు కల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయా నేతల్లో రిజర్వేషన్ల భయం పట్టుకుంది. ఏ రిజర్వేషన్ వస్తదో అని చర్చించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో 1,684 గ్రామపంచాయతీలు ఉండగా.. 23,22,054 మంది పల్లెల్లో ఓటర్లు ఉన్నారు. 74 ZPTC స్థానాలతో పాటు 19 పురపాలికలున్నాయి.
News July 11, 2025
రాజంపేట: యువకుల మిస్సింగ్‌పై పవన్‌కు ఫిర్యాదు

రాజంపేటకు చెందిన ముగ్గురు యువకులు థాయిలాండ్‌లో ఉద్యోగానికి వెళ్లి అదృశ్యమయ్యారు. వాళ్ల అచూకీ కనిపెట్టాలని రాజంపేటకు చెందిన పూజారి గిరిజా కుమారి అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరారు. ఆయనకు యువకుల వివరాలు అందజేశారు. మహిళ ఫిర్యాదుతో డిప్యూటీ సీఎం కేంద్రంతో మాట్లాడారు. రాజంపేటలోని ఎస్వీ నగర్‌కు చెందిన ఓ యువకుడితో మరో ఇద్దరు 3నెలల కిందట థాయిలాండ్ వెళ్లగా వాళ్ల ఆచూకీ లభించలేదు.