News July 9, 2024
నేటి నుంచి మెప్మా అధికారులతో సమీక్షలు

మహిళా స్వశక్తి సంఘాల బలోపేతానికి మంగళవారం నుంచి మూడు రోజులపాటు సమీక్షలు నిర్వహిస్తామని మెప్మా పీడీ ప్రియంవద సోమవారం తెలిపారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో 22 వేల మహిళా సంఘాలకు సంబంధించిన వివిధ అంశాలపై పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు, సిబ్బందితో సమీక్షిస్తారన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లింకేజీ రుణాలు, పుస్తక నిర్వహణ, సమృద్ధి పథకాలపై చర్చిస్తారని తెలిపారు.
Similar News
News November 17, 2025
తూ.గో: ఆశాజనకంగా ఆయిల్ ఫామ్ సాగు

తూ.గో జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఎకరా సాగుకు పెట్టుబడి పోను రూ.1.50 లక్షలు ఆదాయం లభిస్తోందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో టన్ రూ.19,636 పలుకుతుంది. రూ.16 వేలు పైబడి ఉంటే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. మూడేళ్ల కిందట రూ.23 వేలు పైబడి ధర లభించింది. జిల్లా వ్యాప్తంగా 48,992 ఎకరాల్లో సాగవుతోందని ఉద్యాన అధికారి ఎన్. మల్లికార్జునరావు తెలిపారు.
News November 16, 2025
17న యథావిధిగా ‘పీజీఆర్ఎస్’: కలెక్టర్ కీర్తి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పీజీఆర్ఎస్ (PGRS) కార్యక్రమం ఈ నెల 17న యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల, సచివాలయ కార్యాలయాల్లో సమర్పించవచ్చని సూచించారు. నేరుగా రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, అక్కడే తమ ఫిర్యాదు స్థితిని కూడా తెలుసుకోవచ్చని కలెక్టర్ శనివారం పేర్కొన్నారు.
News November 15, 2025
తూ.గో: 48 గంటల్లో రూ.56.84 కోట్ల జమ

తూ.గో జిల్లా ధాన్యం సేకరణ అంచనా 4 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించినట్లు జేసీ వై.మేఘ స్వరూప్ వెల్లడించారు. ప్రస్తుతానికి 5,890 ధాన్యం కొనుగోలు కూపన్లు జనరేట్ చేశామన్నారు. 16 మండలాల్లో 122 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 3,695 మంది రైతుల నుంచి 27,616.360 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు చెప్పారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోపే 3,191 మంది రైతులకు రూ. 56.84 కోట్లు జమ చేశామని తెలిపారు.


