News February 5, 2025

నేటి నుంచి మేడారంలో తొలి ఘట్టం!

image

తాడ్వాయి మండలం మేడారంలో నేటి (బుధవారం) నుంచి సమ్మక్క-సారలమ్మ మినీ జాతర పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలోని సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో పూజారులు శుద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజ సామగ్రిని శుద్ధిచేసి నైవేద్యాలు సమర్పించి మినీ జాతర విజయవంతం కావాలని అమ్మవార్లను మొక్కుకుంటారు. కాగా ఈనెల 12 నుంచి మినీ జాతర ప్రారంభం కానుంది.

Similar News

News October 31, 2025

సిద్దిపేట: తుపాకీతో బెదిరించిన నిందితుల అరెస్ట్

image

అక్బర్‌పేట మం. రుద్రారంలో ఈనెల 28న RMP డాక్టర్ ఆర్ఎంపీ లక్ష్మీ నరసయ్య ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను తుపాకీతో బెదిరించిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి వివరించారు. బిక్షపతి, బ్రహ్మం, నర్సింలు@ కమలాకర్‌, ఆర్ఎంపీ నరేందర్ రెడ్డిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. తేలికగా డబ్బు సంపాధించాలనే ఆశతో వీరంతా గ్యాంగ్‌గా ఏర్పడి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తేల్చారు.

News October 31, 2025

ADB: ఏకలవ్య గురుకులాల ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమీక్ష

image

కలెక్టరేట్‌లో గురువారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ రాజర్షి షా నిర్వహించారు. ఏకలవ్య పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, నాణ్యమైన విద్యపై ఆయన ప్రిన్సిపల్స్‌ను ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, డీఎంహెచ్‌వో, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

News October 31, 2025

అనకాపల్లి: రేపు రూ.108.8 కోట్ల పింఛన్ల పంపిణీ

image

అనకాపల్లి జిల్లా 24 మండలాల‌తో పాటు అనకాపల్లి జీవీఎంసీ, ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల పరిధిలో శనివారం లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి రూ.108.8 కోట్ల పింఛన్లు పంపిణీ చేయ‌నున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శచీదేవి తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ ఆధారంగా సొమ్ము అందజేస్తారని చెప్పారు. కొత్తగా 344 స్పౌజ్ పింఛన్లు మంజూరై పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.