News February 5, 2025
నేటి నుంచి మేడారంలో తొలి ఘట్టం!

తాడ్వాయి మండలం మేడారంలో నేటి (బుధవారం) నుంచి సమ్మక్క-సారలమ్మ మినీ జాతర పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలోని సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో పూజారులు శుద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజ సామగ్రిని శుద్ధిచేసి నైవేద్యాలు సమర్పించి మినీ జాతర విజయవంతం కావాలని అమ్మవార్లను మొక్కుకుంటారు. కాగా ఈనెల 12 నుంచి మినీ జాతర ప్రారంభం కానుంది.
Similar News
News February 10, 2025
26 ఏళ్ల క్రితం.. ఢిల్లీకి 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు!

ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. అయితే చివరిసారిగా (1993-1998) ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు పాలించారు. తొలుత మదన్‌లాల్ ఖురానా సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో 27 నెలలకే రాజీనామా చేశారు. ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉల్లి ధరలపై విమర్శలతో 31 నెలల్లో రిజైన్ చేశారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ 52 రోజులపాటు సీఎంగా ఉన్నారు.
News February 10, 2025
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

TG: సెలవు దినాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టొద్దని హైడ్రాకు హైకోర్టు సూచించింది. శుక్రవారం నోటీసులిచ్చి, వివరణ ఇచ్చేందుకు శనివారం ఒక్కరోజే సమయమిస్తూ ఆదివారం కూల్చివేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి(D) అబ్దుల్లాపూర్‌మెట్(M) కోహెడలో నిర్మాణాల కూల్చివేతలపై నమోదైన పిటిషన్‌ను విచారించింది. వివరణ ఇచ్చేందుకు భవన యజమానులకు సహేతుకమైన సమయం ఇవ్వాలని పేర్కొంది.
News February 10, 2025
హత్నూర: దౌల్తాబాద్ విద్యార్థుల ప్రతిభ

హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్ లో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ఆదివారం నిర్వహించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ 9వ తరగతి విద్యార్థులు నవాజ్, భవానీ, అన్విత క్రియ ఆర్టిజన్ స్పెక్ట్రమ్ డిజాస్టర్ నమూనాకు రూ. 30 వేల బహుమతి అందుకున్నారు. వీరిని జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయుడు వెంకటేశంను కలెక్టర్ వల్లూరు క్రాంతి అభినందించారు.