News February 5, 2025

నేటి నుంచి మేడారంలో తొలి ఘట్టం!

image

తాడ్వాయి మండలం మేడారంలో నేటి (బుధవారం) నుంచి సమ్మక్క-సారలమ్మ మినీ జాతర పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలోని సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో పూజారులు శుద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజ సామగ్రిని శుద్ధిచేసి నైవేద్యాలు సమర్పించి మినీ జాతర విజయవంతం కావాలని అమ్మవార్లను మొక్కుకుంటారు. కాగా ఈనెల 12 నుంచి మినీ జాతర ప్రారంభం కానుంది.

Similar News

News January 16, 2026

నితీశ్‌పై తీవ్ర విమర్శలు.. తిప్పికొట్టిన విహారి

image

భారత జట్టుకు ఆల్‌రౌండర్‌గా పనికిరాడంటూ నితీశ్ రెడ్డిపై వస్తున్న విమర్శలపై హనుమ విహారి Xలో స్పందించారు. ’22 ఏళ్ల వయసులో బ్యాటింగ్, పేస్ బౌలింగ్ చేసే క్రికెటర్లు దేశంలో ఎవరైనా ఉన్నారా? నితీశ్ ఇప్పటివరకు 3 వన్డేల్లో 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. 4 T20ల్లో 3W, 4th సీమర్‌గా 10 టెస్టుల్లో 8W పడగొట్టాడు. మెల్బోర్న్‌లో సెంచరీ చేశాడు. అది ఇప్పటికీ చాలా మందికి నెరవేరని కల’ అంటూ నితీశ్‌కు మద్దతునిచ్చారు.

News January 16, 2026

సిద్దిపేట: సోషల్ మీడియా లింక్స్‌పై అప్రమత్తంగా ఉండాలి: సీపీ

image

సిద్దిపేట పోలీస్ కమిషనర్ సీపీ రష్మి పెరుమాళ్ జిల్లా ప్రజలకి ముఖ్య విషయం విజ్ఞప్తి చేశారు. ‘రూ.5 వేలు వస్తాయి.. లింక్స్ షేర్ చేస్తే’ అని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు వస్తున్నాయని, ఇలాంటి ఫేక్ లింక్స్ నమ్మవద్దని తెలియజేశారు. ఇలాంటి లింక్స్ క్లిక్చేస్తే సైబర్ నేరగాళ్ల చేతులకి దొరికిపోతామని హెచ్చరించారు. లింక్ పై క్లిక్ చేస్తే ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

News January 16, 2026

నల్గొండ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

⏵నల్గొండ: లింకులను క్లిక్ చేస్తే బుక్ అయినట్లే: డీఎస్పీ
⏵నార్కట్ పల్లి: బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న చెరువుగట్టు
⏵నల్గొండ: వర్గపోరుతో ఎవరికి లాభం చేకూరేనో..
⏵నల్గొండలో ఇక నవశకం
⏵కేతేపల్లి: ఐదు రోజుల్లో 3 లక్షలకు పైగా వెహికల్స్ పాస్
⏵చండూర్: పండుగ పూట తాగునీటి కష్టాలు
⏵చిట్యాల: 53 వానరాల బందీ
⏵నల్గొండ: జిల్లాలో ఫార్మసీ రిజిస్ట్రీ అంతంతే
⏵నల్గొండ ఆసుపత్రిలో ఇదీ పరిస్థితి