News April 12, 2025

నేటి నుంచి మేడ్చల్‌లో ధాన్యం కేంద్రాలు ప్రారంభం

image

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో యాసంగి సీజన్‌లో 30 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ మొదలుపెట్టింది. ఏప్రిల్ 12 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను సివిల్ సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇన్‌ఛార్జ్ DCSO సుగుణ బాయి తెలిపారు.

Similar News

News November 28, 2025

నేడే రాజధానిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

image

AP: రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. దేశంలోని 15 ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు రాజధానిలో తమ ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటికి ఈ ఉదయం 11.22గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, CM CBN చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. రూ.1,334 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆయా బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు, మంత్రులు, రాజధాని రైతులు హాజరుకానున్నారు.

News November 28, 2025

వనపర్తి: పంచాయతీ ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ నంబర్

image

వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 08545-233525కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆమె తెలియజేశారు.

News November 28, 2025

రాష్ట్రస్థాయి క్రికెట్‌లో ఉమ్మడి ఖమ్మం జట్టు రన్నరప్

image

సంగారెడ్డిలో 3 రోజులుగా జరిగిన SGF రాష్ట్ర స్థాయి అండర్-19 బాలికల క్రికెట్ టోర్నమెంట్‌లో ఉమ్మడి ఖమ్మం జట్టు అద్భుత ప్రదర్శనతో ద్వితీయ స్థానం(రన్నరప్‌) సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఖమ్మం-HYD జట్లు తలపడ్డాయి. ఆసక్తికరంగా సాగిన పోరులో చివరకు 6 పరుగుల స్వల్ప తేడాతో HYD జట్టు విజయం సాధించింది. ఖమ్మం జట్టు ప్రతిభావంతమైన ఆటతీరుతో రన్నరప్‌గా నిలవడంతో, జిల్లా క్రీడాకారులు, కోచ్‌లు అభినందనలు అందుకున్నారు.