News October 9, 2024
నేటి నుంచి రూ.49కే K.G టమాటా: చిత్తూరు జేసీ
చిత్తూరు రైతు బజారులలో నేటి నుంచి రాయితీ ధరతో టమాటాలు పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలియజేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన టమాటాను కిలో రూ. 49కే అందజేస్తామని ఆమె చెప్పారు. ఈ మేరకు రైతు బజారులో ఉదయం కౌంటర్ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే ఉల్లిపాయలను అందిస్తామని స్పష్టం చేశారు.
Similar News
News January 2, 2025
చిత్తూరు: కానిస్టేబుళ్ల ఎంపికకు 394 మంది హాజరు
చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కానిస్టేబుల్‌ల ఎంపిక కార్యక్రమం మూడోరోజు కొనసాగినట్టు పోలీసులు తెలిపారు. 599 మంది అభ్యర్థులకు 394 మంది హాజరు కాగా 163 మంది అర్హత సాధించినట్టు వారు చెప్పారు. శుక్రవారం మహిళల అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. 495 మంది హాజరుకానున్నట్టు చెప్పారు.
News January 1, 2025
బోయకొండలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్
బోయకొండలో గుర్తు తెలియని వాహనం ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు దుర్మరణం చెందినట్లు ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు. చౌడేపల్లె మండలం, బోయకొండ అప్పినేపల్లికి చెందిన ఎన్ రాజన్న(50) భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సొంత పనిపై బుధవారం వేకువజామున పక్షిరాజపురానికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సుమలత ఉండగా పిల్లలులేరు. కేసు దర్యాప్తులో ఉందని SI తెలిపారు.
News January 1, 2025
TPT: జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్
APSSDC ఆధ్వర్యంలో జనవరి 3వ తేదీ నారావారిపల్లి టీటీడీ కళ్యాణ మండపంలో జరగబోయే మెగా జాబ్ మేళా పోస్టర్‌ను మంగళవారం తిరుపతి జిల్లా వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళా దాదాపు 20 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, 1200 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు పాల్గొన్నారు.