News December 7, 2024
నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత
శ్రీశైల క్షేత్రంలో వెలసిన మల్లికార్జున స్వామి స్పర్శదర్శనాన్ని శని, ఆది, సోమవారాల్లో తాత్కాలికంగా నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. శని, ఆది, సోమవారాల్లో క్షేత్రానికి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ఈ 3 రోజుల్లో ఉచిత స్పర్శదర్శన సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. తిరిగి మంగళవారం నుంచి శుక్రవారం వరకు యథావిధిగా స్పర్శ దర్శనం సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.
Similar News
News January 22, 2025
రూ.6.91కోట్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్: కర్నూలు కలెక్టర్
కర్నూలు జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నీటి సమస్య తలెత్తకుండా రూ.6.91 కోట్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు.
News January 22, 2025
‘జాతీయ రహదారులకు భూసేకరణ పూర్తి చేయండి’
రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణం, విస్తరణకు అవసరమైన భూ సేకరణను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో పాటు రెవెన్యూ, అటవీ, TR&B, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News January 21, 2025
నంద్యాల: కందులకు రూ.7,550ల మద్దతు ధర
రాష్ట్ర ప్రభుత్వం నాఫెడ్ ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధర రూ.7,550లతో ఈ క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి కందులు కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసిందని మార్క్‌ఫెడ్ డీఎం హరినాథ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఒక రైతుకు రోజుకు 40 క్వింటాళ్ల పరిమితిని విధించినట్లు చెప్పారు. బుధవారం నుంచి ప్రతి రైతు సేవ కేంద్రాలలో కందుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.