News April 6, 2024

నేటి నుంచి శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం రద్దు

image

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో నేటి శనివారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. అందరికీ స్వామివారి దర్శనం కల్పించాలని ఉద్దేశంతో మల్లన్న స్పర్శ దర్శనాన్ని నేటి నుంచి ఉగాది ఉత్సవాలు ముగిసే వరకు రద్దు చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. అందరికీ అలంకార దర్శనమేనని తెలిపారు. కాగా శుక్రవారం వరకు భక్తులందరికీ స్వామివారి స్పర్శ దర్శనాన్ని కల్పించారు.

Similar News

News January 16, 2025

నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు చేపట్టండి: మంత్రి టీజీ భరత్

image

రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు చేపట్టండి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. గురువారం కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా, ఎస్పీతో కలిసి ఆయా శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కోరారు.

News January 16, 2025

బేతంచర్లలో పేడ రంగు తాగి మహిళ ఆత్మహత్య

image

ఇంటి ముందు కల్లాపు చల్లుకునే పేడ రంగు తాగి మహిళ మృతి చెందిన ఘటన బేతంచెర్ల మండలం పెండేకల్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొట్టాల మహేశ్వరి(22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడ రంగును నీటిలో కలుపుకొని తాగింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న మహేశ్వరిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు బంధువులు వాపోయారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లెకు తరలించి కేసు నమోదు చేశారు.

News January 16, 2025

ఉపాధి వేతన దారులకు పనులు కల్పించండి: కలెక్టర్

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామపంచాయతీలో ప్రతిరోజు వంద మంది ఉపాధి వేతనదారులకు పనులు కల్పించి నిర్దేశించిన లేబర్ బడ్జెట్ మొబిలైజేషన్ లక్ష్యాన్ని సాధించాలని అధికారులను కలెక్టర్ జీ.రాజకుమారి ఆదేశించారు. గురువారం నంద్యాల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లేబర్ బడ్జెట్, హౌసింగ్ మ్యాండేస్, సచివాలయ సర్వీసులపై సమీక్షించారు.