News April 5, 2025
నేటి నుంచి సిరసనగండ్ల బ్రహ్మోత్సవాలు

నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరసనగండ్ల శ్రీ సీతారామ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రెండో భద్రాద్రిగా పేరుపొందిన సిరసనగండ్ల బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాలకు దేవాలయాన్ని దేదీప్యమానంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వహణ అధికారులు వెల్లడించారు.
Similar News
News November 16, 2025
వారణాసి: ఒకేసారి ఇన్ని సర్ప్రైజులా?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘<<18299698>>వారణాసి<<>>’ నుంచి వరుస అప్డేట్స్ వచ్చాయి. globe trotter ఈవెంట్లో మూవీ టైటిల్, మహేశ్ ఫస్ట్ లుక్, 3.40 నిమిషాల గ్లింప్స్ రిలీజ్ చేశారు. 2027 సమ్మర్లో మూవీ విడుదల అని కీరవాణి తెలిపారు. రామాయణంలో ముఖ్యమైన <<18299599>>ఘట్టం <<>>తీస్తున్నానని, మహేశ్కు రాముడి వేషం వేశానని రాజమౌళి వెల్లడించారు. దీంతో ఒకేసారి ఇన్ని సర్ప్రైజులు ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
News November 16, 2025
సిటీలో అన్ని సీజన్లలో ట్యాంకర్లకు డిమాండ్

జలమండలి పరిధిలో దాదాపు 5 సంవత్సరాలలో ట్యాంకర్ డిమాండ్ 5 రెట్లు పెరిగింది. 2021లో 59 వేలకుపైగా ఉండగా 2025 నాటికి సుమారు రెండు లక్షల చేరింది. అన్ని సీజన్లలోనూ ట్యాంకర్ల డిమాండ్ ఏర్పడగా అధికారులు కొత్త ఫిల్లింగ్ స్టేషన్ల నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏర్పడే డిమాండ్ దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపడుతున్నారు.
News November 16, 2025
KMR: త్వరలో చెస్ బోర్డుల పంపిణీ

సోషల్ మీడియా దుర్వినియోగం, మద్యపాన వ్యసనానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ‘చెస్ నెట్వర్క్ ఆర్గనైజేషన్’ బృందం ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రామారెడ్డి (M) రెడ్డిపేట తండాకు చెందిన శంకర్తో పాటు బృంద సభ్యులు శనివారం కామారెడ్డి DEO రాజును కలిసి సంస్థ లక్ష్యాన్ని వివరించారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలలకు త్వరలో చెస్ బోర్డులను ఉచితంగా అందించనున్నట్లు వారు ప్రకటించారు.


