News April 5, 2025
నేటి నుంచి సిరసనగండ్ల బ్రహ్మోత్సవాలు

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరసనగండ్ల శ్రీ సీతారామ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రెండో భద్రాద్రిగా పేరుపొందిన సిరసనగండ్ల బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాలకు దేవాలయాన్ని దేదీప్యమానంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వహణ అధికారులు వెల్లడించారు.
Similar News
News April 22, 2025
ఎల్లుండి నుంచి సెలవులు

APలో స్కూళ్లకు ఎల్లుండి నుంచి(APR 24) నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. డిప్యుటేషన్లపై పనిచేస్తున్న టీచర్లు ఇవాళ రిలీవై రేపు పాత స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. మరోవైపు తెలంగాణలోనూ ఎల్లుండి నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. హాలిడేస్‌లో పిల్లలకు తరగతులు నిర్వహించరాదని అధికారులు ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు స్పష్టం చేశారు.
News April 22, 2025
విశాఖ: మేడ మీద నుంచి పడి వివాహిత మృతి

మేడ మీద బట్టలు ఆరవేయడానికి వెళ్లి వివాహిత మృతి చెందిన ఘటన విశాఖలో సోమవారం చోటుచేసుకుంది. 61వ వార్డు ఇండస్ట్రీ కాలనీలో నివాసముంటున్న కోమలి తన ఇంటి మూడో అంతస్తులో బట్టలు ఆరవేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కళ్యాణి ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త శ్రీనుబాబు మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News April 22, 2025
రేపే రిజల్ట్.. సత్యసాయి జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 23,730 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.