News January 13, 2025
నేటి నుంచి SU పరిధిలోని కళాశాలలకు సెలవులు

సంక్రాంతి పండగ నేపథ్యంలో.. కరీంనగర్ పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలకు సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, బీఈడీ, ఫార్మసీ, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు నేటి నుంచి ఈ నెల 15 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తిరిగి 16 నుంచి తరగతులకు హాజరు కావాలన్నారు.
Similar News
News December 6, 2025
హోంగార్డుల సేవలు అమూల్యం: సీపీ గౌష్ ఆలం

63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ గౌష్ ఆలం, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని కొనియాడారు. అత్యవసర విధుల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు పంపిణీ చేశారు.
News December 6, 2025
కరీంనగర్: ఈ నెల 22 వరకూ ఫీజు చెల్లించవచ్చు

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ ప్రథమ, ద్వితీయ, ఎంబీఏ తృతీయ, ద్వితీయ విడత సప్లిమెంటరీ పరీక్షా ఫీజు గడువు ఈనెల 22 వరకు ఉన్నట్లు కరీంనగర్ స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ ఏం సత్య ప్రకాష్ తెలిపారు. ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.
News December 6, 2025
EVMలకు కట్టుదిట్టమైన భద్రత.. వివిధ పార్టీలతో పరిశీలన

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ శనివారం తనిఖీ చేశారు. ఆర్డీఓ మహేశ్వర్తో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సహా పలు పార్టీల ప్రతినిధులు ఈ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లకు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, పోలీస్ గార్డుల విధులను ఆమె పర్యవేక్షించారు.


