News January 13, 2025
నేటి నుంచి SU పరిధిలోని కళాశాలలకు సెలవులు

సంక్రాంతి పండగ నేపథ్యంలో.. కరీంనగర్ పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలకు సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, బీఈడీ, ఫార్మసీ, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు నేటి నుంచి ఈ నెల 15 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తిరిగి 16 నుంచి తరగతులకు హాజరు కావాలన్నారు.
Similar News
News February 19, 2025
శంకరపట్నం: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి పరిస్థితి తీవ్ర విషమం

శంకరపట్నం మండలం కొత్తగట్టు జాతీయ రహదారిపై బైకును లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి పరిస్థితి తీవ్ర విషమంగా మారింది. స్థానికుల తెలిపిన వివరాలిలా.. హుజురాబాద్ నుంచి కొత్తగట్టు వెళ్తున్న బైకర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకర్ కిందపడి తీవ్రగాయాల పాలయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 19, 2025
జగిత్యాల: గంజాయి సరఫరా.. ముగ్గురిపై కేసు నమోదు

గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని మగ్గిడికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తున్న సమాచారంతో దొంతాపూర్ గ్రామానికి చెందిన దుర్గం నిశాంత్, కలువ గంగాధర్, ఎస్‌కే.ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 829 గ్రాముల గంజాయి దొరికినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
News February 19, 2025
గోదావరిఖని: ‘భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే..!’

భవిష్యత్ అంతా మైనింగ్ రంగందేనని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి అగ్ర స్థాయిలో తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.