News February 2, 2025
నేటి నుంచే చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 9వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు భక్తులకు వసతులు, ఆలయానికి రంగులు, పారిశుద్ధ్యం, మంచినీటి వసతిలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏర్పాట్ల పనులలో నిమగ్నమై ఉన్నారు. ఈసారి జాతరకు సుమారుగా 12 లక్షల వరకు భక్తులు రావచ్చని అంచనా వేశారు.
Similar News
News November 1, 2025
కాశీబుగ్గ ఆలయ తొక్కిలాట దుర్ఘటనపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి

కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి <<18167876>>ఆలయ తొక్కిలాట దుర్ఘటన<<>>పై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై దేవాలయ అధికారులతో మాట్లాడిన మంత్రి.. సంఘటన స్థలానికి బయల్దేరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా ఈ ఘటనలో 9 మంది మరణించినట్లు తెలుస్తోంది.
News November 1, 2025
VJA: పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్న పశ్చిమ బైపాస్

విజయవాడ పశ్చిమ బైపాస్ విద్యుత్ హైటెన్షన్ వైర్ల అలైన్‌మెంట్ సమస్యకు హైకోర్టు తీర్పుతో పరిష్కారం లభించింది. జక్కంపూడి, అంబాపురంలోని 6 టవర్లను అలైన్‌మెంట్ ప్రకారం కొనసాగించాలని న్యాయమూర్తి తాజాగా ఆదేశించారు. దీంతో ఈ టవర్ల ఎత్తును రహదారిపై నుంచి 14 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులు పూర్తైతే పశ్చిమ బైపాస్‌లో ఆ మార్గం సైతం అందుబాటులోకి రానుంది.
News November 1, 2025
భీమవరం: పింఛన్లు అందజేసిన కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతోందని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం వీరమ్మ పార్క్ చుట్టుపక్కల శనివారం లబ్ధిదారులకు కలెక్టర్ పింఛన్లు అందించారు. లబ్దిదారులకు పింఛన్లు అందజేసి వారి కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా అని ఆరా తీశారు.


