News October 26, 2024
నేటి నుంచే పాపికొండల యాత్ర
నేటి నుంచి పాపికొండల యాత్ర ప్రారంభమవుతుంది. భద్రాచలం నుంచి రాజమండ్రి వరకూ.. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకూ ఈ యాత్ర సాగనుంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం నిలకడగా ఉండటంతో 4 నెలల తర్వాత పాపికొండల యాత్ర ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇందుకోసం టూరిజంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేవీపట్నం మండలం పోచమ్మ గండి నుంచి టూరిజం బోట్లు బయల్దేరనున్నాయి.
Similar News
News November 10, 2024
గడ్డి మందు తాగి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
గడ్డి మందు తాగి ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం భద్రాచలం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ధనలక్ష్మి తన ఇంట్లో గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే భద్రాచలంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా విద్యార్థి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2024
ఖాళీ స్థలాల యజమానులకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం, చెత్త వేయడం వల్ల దోమలు, కోతులతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఖాళీ ప్లాట్ లను యజమానులు శుభ్రం చేయకుంటే వెంటనే ప్రభుత్వ స్థలంగా బోర్డులు పెట్టాలని ఆదేశించారు. కూడలి ఉన్న ప్రదేశంలో చెత్త వేయకుండా ప్రజలలో అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు.
News November 10, 2024
చండ్రుగొండ : హాస్టల్లో పాము కలకలం
చండ్రుగొండ ఎస్సీ బాలుర వసతి గృహంలో పాము ప్రత్యక్షమైంది. హాస్టల్ బాత్రూంలో నుంచి పాము బయటకు వస్తున్న క్రమంలో స్థానికులు గుర్తించారు. ఆ సమయంలో హాస్టల్లో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మిగతావారు పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ఇవ్వడంతో ఇళ్లకు వెళ్లినట్లు సమాచారం. అయితే హాస్టల్ పరిసర ప్రాంతం పిచ్చి మొక్కలు చెత్తాచెదారంతో నిండి ఉంటుందని స్థానికులు చెప్పారు. శుభ్రం చేయించాలని కోరారు.