News February 17, 2025
నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: భూపాలపల్లి కలెక్టర్

నేడు (సోమవారం) జరుగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదివారం తెలిపారు. జిల్లాలో శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, జిల్లా యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం తాత్కాలిక రద్దును ప్రజలు గమనించాలని ఆయన సూచించారు.
Similar News
News November 20, 2025
542 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)లో 542 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 24లోపు అప్లై చేసుకుని దరఖాస్తును స్పీడ్ పోస్టులో పంపాలి. వెహికల్ మెకానిక్, MSW పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. రాతపరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, PET, ట్రేడ్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bro.gov.in/
News November 20, 2025
ఎన్టీఆర్: పత్తి రైతులపై సీసీఐ నిర్లక్ష్యం

ఎన్టీఆర్ జిల్లాలో సీసీఐ ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఏ కేంద్రంలోనూ కొనుగోలు జరగక రైతులు ఆందోళన చెందుతున్నారు. కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, ఏ.కొండూరు, గంపలగూడెంలో కేంద్రాలు ఉన్నప్పటికీ అధికారులు పత్తి తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.7,710 – 8,110గా ఉన్నా దళారుల చేత తక్కువకు కొనిపించి లాభాలు పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
News November 20, 2025
వేములవాడ: డ్రైనేజీలో పడి యువకుడి మృతి

వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డు ప్రాంతంలోని బతుకమ్మ తెప్ప వద్ద గల ప్రధాన డ్రైనేజీలో పడిపోయి ఓ యువకుడు మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి అనంతరం ద్విచక్రవాహనం అదుపుతప్పి డ్రైనేజీలో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున డ్రైనేజీలో ద్విచక్ర వాహనాన్ని, యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతి చెందిన యువకుడు స్థానిక బద్ది పోచమ్మ ఆలయంలో తాత్కాలిక పద్ధతిన పని చేస్తాడని తెలుస్తోంది.


