News February 17, 2025

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: భూపాలపల్లి కలెక్టర్ 

image

నేడు (సోమవారం) జరుగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదివారం తెలిపారు. జిల్లాలో శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, జిల్లా యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం తాత్కాలిక రద్దును ప్రజలు గమనించాలని ఆయన సూచించారు.

Similar News

News March 20, 2025

MBNR: రంజాన్ మాసం.. హాలీమ్‌కు సలాం.!

image

రంజాన్ నెలలో దర్శనమిచ్చే నోరూరించే వంటకం హలీం. ఉపవాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పటికే ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, ఆయా మండలాల కేంద్రాల్లో హలీం సెంటర్లు దర్శనమిస్తున్నాయి. మాంసం, గోధుమలు, పప్పుదినుసులు, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌తో కలిపి ఉడికించి తయారు చేస్తారు. చివర్లో వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇస్తారు.మీరు తింటే ఎలా ఉందో కామెంట్ పెట్టండి?

News March 20, 2025

BHPL: కుల మతాలకు అతీతంగా.. బడి పంతుల్ల స్నేహం

image

చిట్యాల మండలంలో జూకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కులమతాలకు అతీతంగా బడిపంతుల్లు స్నేహాన్ని కనబరుచుకుంటున్నారు. ముస్లింకు చెందిన ఉపాధ్యాయుడు డాక్టర్.రఫీకి రానున్న రంజాన్‌కు డ్రై ఫ్రూట్స్ అందజేసి విద్యార్థుల ముందు మమకారాన్ని పంచుకున్నారు. తనువుకు ఉత్సాహం ఇచ్చే ఉత్ప్రేరకమే స్నేహం అని నిరూపించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కృష్ణ, రాధికరాణి, మమత, ఉమాదేవి, రంజిత్ కుమార్, రవీందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

News March 20, 2025

ఓవర్ థింకింగ్ వేధిస్తోందా..? ఈ టిప్స్ పాటించండి

image

ఓవర్‌థింకింగ్‌కు ప్రధాన కారణం నెగిటివిటీ కనుక దానికి దూరంగా ఉండండి. మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించడం మానేయండి. మిమ్మల్ని ఏ విషయమైన ఇబ్బంది పెడితే 72 గంటల పాటు దాన్ని మర్చిపోండి. తర్వాత అది మిమ్మల్ని అంతగా వేధించదు. సోషల్ మీడియా అధికంగా వాడటం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది కనుక దానికి దూరంగా ఉండండి. ధ్యానం చేయడంతో కంగారు తగ్గడంతో పాటు వాస్తవ పరిస్థితులని అర్థం చేసుకుంటారు.

error: Content is protected !!