News May 11, 2024
నేటి రాత్రి 7 గంటల నుంచి ఎన్నికల ఆంక్షలు: కలెక్టర్ షణ్మోహన్

జిల్లాలో 11వ తేదీ రా.7 గం.ల నుంచి 14వ తేది రా.7 గం.ల వరకు ఎన్నికల ఆంక్షలు ఉంటాయని కలెక్టర్ ఎస్.షణ్మోహన్ శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌కు 48 గంటల ముందు బహిరంగ సభలు నిషేదమన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానాతో పాటు రెండు శిక్షలకు అర్హుడలన్నారు.
Similar News
News March 16, 2026
సెలవులో చిత్తూరు కలెక్టర్

వ్యక్తిగత కారణాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సెలవు పెట్టారు. నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు సెలవులో వెళ్తున్నారు. తిరిగి ఆయన 21న విధులకు హాజరుకానున్నారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.
News March 16, 2026
చిత్తూరు: నేటి నుంచి ‘రైతన్న-మీకోసం’ వారోత్సవాలు

జిల్లాలో సోమవారం నుంచి ‘రైతన్నా- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ మురళి తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రొసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, సంక్షేమం నుంచి సంపద సృష్టి దిశగా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
News March 15, 2026
కాణిపాకం: 17న అత్యవసర ధర్మకర్తల మండలి సమావేశం

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 17న ఉదయం 10:30 గంటలకు అత్యవసర ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పెంచల కిశోర్ తెలిపారు. యుద్ధ పరిస్థితులు, అవసరమైన సరుకుల సరఫరా, ప్రసాదానికి ఉపయోగించే గ్యాస్ సరఫరా సంబంధిత ఏర్పాట్లపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశానికి ధర్మకర్తల మండలి ఛైర్మెన్, సభ్యులు, అధికారులు హాజరుకావాలని వారు కోరారు.


