News December 23, 2024

నేటి సాయంత్రం విజయవాడలో సీఎం పర్యటన

image

విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌ సెంటర్‌లో నేడు ప్రభుత్వం తరఫున సెమీ క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబుతో పాటు కూటమి మంత్రులు, నాయకులు పాల్గొననున్నారు.

Similar News

News January 20, 2025

విజయవాడ మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

image

మహా కుంభమేళాకు వెళ్లే వారి కోసం విజయవాడ మీదుగా తిరుపతి- బనారస్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07107 తిరుపతి- బనారస్ రైళ్లను 2025 ఫిబ్రవరి 8, 15, 22 తేదీలలో నడుపుతున్నామని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News January 19, 2025

విజయవాడ: దేవాలయాలపై చట్ట సవరణ చేయాలని వినతి

image

ఇటీవల విజయవాడ సమీపంలో హైందవ శంఖారావం కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. నేడు ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను VHP కేంద్రీయ ఉపాధ్యక్షుడు గంగరాజు, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, రాష్ట్ర కోశాధికారి దుర్గాప్రసాద్ రాజు విజయవాడలో కలిశారు. ఇటీవల నిర్వహించిన హైందవ శంఖారావ సభ వివరాలను అమిత్ షాకు అందించారు. కేంద్ర ప్రభుత్వం దేవాలయాల స్వయం ప్రతిపత్తి కొరకు చట్ట సవరణ చేయాలని కోరారు.

News January 19, 2025

అమిత్‌షా పర్యటనకు సర్వం సిద్ధం: మంత్రి కొలుసు

image

కేంద్రమంత్రి అమిత్‌షా గన్నవరం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కొండపావులూరులోని NIDM, NDRF భవనాల వద్ద ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేశామని కొలుసు చెప్పారు. బహిరంగ సభ జరిగే పరిసర ప్రాంతాలు, నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాల వద్ద పోలీసు అధికారులతో కలసి ఏర్పాట్లు పర్యవేక్షించామని మంత్రి కొలుసు పేర్కొన్నారు.