News October 21, 2024
నేటి PGRS రద్దు: నంద్యాల ఎస్పీ

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం సోమవారం తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తాత్కలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, నంద్యాలకు రావద్దని ఈ సందర్భంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు.
Similar News
News November 25, 2025
కర్నూలు: ‘విద్యార్థుల హృదయాలను గెలిచారు’

కర్నూలు డీఈవో శామ్యూల్ పాల్ మరోసారి తనదైన శైలిలో విద్యార్థుల హృదయాలను గెలిచారు. మంగళవారం క్రిష్ణగిరి మండలంలోని పలు విద్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. క్రిష్ణగిరిలోని ఓ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థికి స్వయంగా గోరుముద్దలు తినిపించారు. అనంతరం కేజీబీవీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఫలితాలలో మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు.
News November 25, 2025
కర్నూలు SP స్పందనకు 95 ఫిర్యాదులు

కర్నూలులో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 95 ఫిర్యాదులు స్వీకరించినట్టు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజలను ప్రత్యక్షంగా కలసి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ, పోలీసు అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.