News February 5, 2025

నేడు అనంతపురంలో హార్టికల్చర్‌ కాంక్లేవ్‌

image

అనంతపురంలోని MYR ఫంక్షన్ హాలులో ఇవాళ ఉదయం 9 గంటలకు హార్టికల్చర్‌ కాంక్లేవ్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కాంక్లేవ్‌ సమావేశంలో హార్టికల్చర్‌ యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్‌లతో పాటు 16 మంది దేశ, విదేశాలకు చెందిన కార్పొరేట్‌ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాతో 6 MOUలు కురుర్చుకోనున్నారు.

Similar News

News March 5, 2026

సీఎంతో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం

image

అమరావతి ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెండింగ్ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతపురం ప్రగతికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం కీలక దిశానిర్దేశం చేశారు.

News March 5, 2026

బెంబేలెత్తుతున్న అనంతపురం జిల్లా ప్రజలు

image

మధ్యాహ్నం ఎండలు, రాత్రి ఉక్కపోతతో అనంత జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ఈనెల 1న దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. బుధవారం 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. గుంతకల్లు మండలంలో 39.8, యల్లనూరులో 38.4, పెద్దపప్పూరులో 38.3, తాడిపత్రిలో 37.7, బి.సముద్రంలో 37.6 డిగ్రీలు నమోదయ్యాయి.

News March 4, 2026

‘జనగణనను పారదర్శకంగా నిర్వహించండి’

image

అనంతపురం జిల్లా జనగణనను అధికారులు, సిబ్బంది బాధ్యతగా చేపట్టాలని డిఆర్ఓ, జిల్లా సెన్సెస్ అధికారి మలోలా సూచించారు. జేఎన్టీయూలో జరిగిన శిక్షణలో డిజిటల్ విధానంపై అవగాహన కల్పించారు. సీఎంఎంఎస్ ద్వారా 33 అంశాల నమోదు, మొబైల్ యాప్ వినియోగంపై వివరించారు. ఎక్కడా లోపాలు లేకుండా జనగణన పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.