News September 18, 2024
నేడు అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం
అమరావతిలో ఇవాళ మధ్యాహ్నం ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవిత, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 100 రోజుల పాలన, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.
Similar News
News October 4, 2024
ATP: మ్యారేజ్ బ్యూరో మోసం.. పెళ్లి సంతోషం 15 రోజులే!
హిందూపురం మం. రాచపల్లికి చెందిన వేమారెడ్డి మ్యారేజ్ బ్యూరో చేతిలో మోసపోయాడు. 44 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోవడంతో ఆయన మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి రూ.3 లక్షలు చెల్లించారు. వారు చూపించిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 15 రోజులకు ఆమె సొంతూరు భీమవరం వెళ్లిపోయి తిరిగిరాలేదు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బ్రోకర్లు కొన్నిరోజులు ఉండి వచ్చేయమన్నారని యువతి చెప్పడం గమనార్హం.
News October 4, 2024
ATP: ఎద్దుల బండిపై నుంచి పడి బాలుడి మృతి
అనంత జిల్లా కణేకల్లు మండల కేంద్రంలో విషాదకర ఘటన జరిగింది. కురుబ జశ్వంత్ (6) అనే బాలుడు ఎద్దుల బండిపై నుంచి పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సెలవులు కావడంతో తండ్రితోపాటు శుక్రవారం ఉదయం ఎద్దుల బండిపై పొలానికి వెళుతుండగా అకస్మాత్తుగా కిందపడి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కణేకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.
News October 4, 2024
అనంతపురంలో కిలో టమాటా రూ.77
అనంతపురం రూరల్ కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.77తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. మార్కెట్‌కు మంగళవారం మొత్తంగా 630 టన్నుల టమాటా దిగుబడులు వచ్చాయని తెలిపారు. కిలో సరాసరి రూ.67, కనిష్ఠ ధర రూ.51 పలికినట్లు తెలిపారు. టమాటా ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది.