News September 2, 2024
నేడు అనంతపురానికి భారత క్రికెటర్లు
అనంతపురంలో జరగనున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీల్లో పాల్గొనే క్రికెటర్లు నేడు నగరానికి చేరుకోనున్నారు. సీ, డీ జట్ల ప్లేయర్లు మాత్రమే నేడు వస్తారు. మధ్యాహ్నం 2 తర్వాత వారు నగరానికి చేరుకుంటారు. త్రీ స్టార్ హోటల్ అలెగ్జాండర్‌లో బస చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సీ జట్టుకు రుతురాజ్, డీ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వహిస్తారు. 8వ తేదీ తర్వాత బెంగళూరు నుంచి ఏ, బీ జట్లు అనంతపురానికి చేరుకుంటాయి.
Similar News
News September 10, 2024
శ్రీ సత్యసాయి జిల్లాను మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ఎంపిక
శ్రీ సత్యసాయి జిల్లాను మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ప్రకటించారని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు, ఇన్-సానిటరీ లెట్రిన్లు లేవని జిల్లా పంచాయతీ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల నుంచి నివేదికలు అందాయన్నారు. దీంతో సత్య సాయి జిల్లాను మ్యాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ప్రకటించారన్నారు.
News September 10, 2024
వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే రూ.10లక్షల విరాళం
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అండగా నిలిచారు. తన వంతు రూ.10 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు చెక్కును సీఎం చంద్రబాబు నాయుడికి అందజేశారు. సీఎం ఎమ్మెల్యే దగ్గుపాటిని అభినందించారు.
News September 10, 2024
అనంతపురం చేరుకున్న భారత్-ఏ, బీ జట్ల ప్లేయర్లు
అనంతపురంలో దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ క్రికెట్ పోటీలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. బెంగళూరులో తొలి మ్యాచ్ ఆడిన భారత్-ఏ, బీ జట్లు నిన్న రాత్రి అనంతపురానికి చేరుకున్నాయి. కేఎల్ రాహుల్, దూబే, పంత్, మయాంక్, రియాన్ పరాగ్ తదితర క్రికెటర్లకు హోటళ్లలో ఘన స్వాగతం పలికారు. క్రికెట్లరను చూడటానికి అభిమానులు హోటల్ వద్ద పడిగాపులు కాశారు. క్రికెటర్లు బస చేసే హోటళ్ల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.