News March 22, 2025
నేడు అన్నమయ్య జిల్లాలో వర్షం

అన్నమయ్య జిల్లాలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జిల్లా ఉక్కపోతతో అల్లాడుతోంది. ప్రజలకు ఉపశమనం కలిగేలా నేడు అన్నమయ్య జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ద్రోణి, బంగాళాఖాతంలో అధికపీడనం ప్రభావంతో నేడు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే ఆది, సోమవారాల్లో కూడా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Similar News
News December 9, 2025
పంచాయతీ ఎన్నికల్లో వారే అధికం!

TG: జీపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. మొత్తం 1,66,48,496 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించగా అందులో 81,38,937 మంది పురుషులు, 85,09,059 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. ఇతరుల సంఖ్య 500గా ఉంది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 3.50 లక్షలు అధికం. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో(11, 14, 17) పోలింగ్ కోసం 1,12,382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఈసీ వెల్లడించింది.
News December 9, 2025
ఇంటి గుమ్మాన్ని ఎందుకు పూజించాలి?

గడపను ద్వార లక్ష్మిగా పూజిస్తే కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది. ఇది దేవతలను ఆహ్వానించే ప్రదేశం కాబట్టి వారి అనుగ్రహం లభిస్తుంది. సిరిసంపదలతో పాటు, పెళ్లికాని వారికి మంచి భాగస్వామి దొరుకుతారు. ఇంట్లో ఉన్న కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. సొంత ఇంటి కల నెరవేరాలంటే యజమాని ఈ ద్వారలక్ష్మి పూజ చేయాలని పండితులు సూచిస్తున్నారు. గడప పూజ కుటుంబానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని అంటున్నారు.
News December 9, 2025
ఎంచివేస్తే, ఆరిక తరుగుతుందా?

కొందరు తమ దగ్గర ఉన్న సంపదను పదే పదే లెక్కబెడుతూ ఉంటారు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. నిరంతరం ఆ ధ్యాసలోనే బతుకుతారు. అయితే మన దగ్గర ఉన్న సంపద లేదా ధాన్యాన్ని ఎన్నిసార్లు లెక్కపెట్టినా అవి పెరిగిపోవు, తరగిపోవు. అవి మొదట ఎంత ఉన్నాయో, ఎన్నిసార్లు లెక్కించినా అంతే ఉంటాయి. వాటి గురించి పదే పదే ఆలోచన తగదు అని చెప్పే సందర్భంలో ఈ సామెత వాడతారు.


