News December 23, 2024

నేడు అమరావతిపై CRDA కీలక సమావేశం

image

అమరావతి పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం 44వ CRDA కీలక సమావేశం జరగనుంది. జోన్ 7, జోన్ 10, మౌలిక వసతుల కల్పనకు అథారిటీ ఆమోదం తెలపనుంది. ఇప్పటికే రూ.45,249 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపనున్నట్లు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. మరో 2వేల కోట్లకు పైబడి పనులు చేపట్టేందుకు ఆమోదం తెలియజేయనుంది.

Similar News

News October 14, 2025

తెనాలి హత్య కేసులో నిందితుడి గుర్తింపు.. ప్రత్యేక బృందాలతో గాలింపు

image

తెనాలి చెంచుపేటలో ఉదయం జరిగిన తిరుపతిరావు హత్య కేసులో పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రే బాధ్యతలు తీసుకున్న త్రీ టౌన్ సిఐ సాంబశివరావు ఉదయాన్నే హత్య జరగడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిసి కెమెరాల ద్వారా అనుమానితుడిని గుర్తించి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పోలీస్ డాగ్ సింబా స్పాట్ నుండి పక్క వీధి మీదగా డొంకరోడ్డు ఎంట్రన్స్ వద్దకు వచ్చి ఆగింది.

News October 14, 2025

యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సైనికుడు మృతి

image

రాజస్థాన్‌లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సంగడిగుంటకు చెందిన తేజ్ భరద్వాజ్ మరణించారు. దేశ సేవపై మక్కువతో సైన్యంలో చేరిన భరద్వాజ్ ప్రమాదవశాత్తు మరణించడం సైన్యం, కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం ఇవాళ సాయంత్రానికి సంగడిగుంటలోని నివాసానికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

News October 14, 2025

తెనాలి: రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్

image

తెనాలి చెంచుపేటలో సంచలనం రేకెత్తించిన జూటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. మృతుని స్వగ్రామం కోడితాడిపర్రులో సొసైటీ దేవాలయానికి సంబంధిన వ్యవహారంలో విభేదాల కారణంగా హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహానికి ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహిస్తున్నారు.