News February 11, 2025
నేడు అహోబిలం రానున్న హీరో సాయి దుర్గ్ తేజ్

ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం ఆలయ దర్శనార్థం మంగళవారం ఉదయం 10 గంటలకు హీరో సాయి దుర్గ్ తేజ్ వస్తున్నట్లు జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య తెలిపారు. ఆళ్లగడ్డ ప్రాంతంలోని అభిమానులు అహోబిలం క్షేత్రానికి వచ్చి ఆయన పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News September 19, 2025
KNR: సీపీఎస్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా షేక్ నిసార్ అహ్మద్

కరీంనగర్ జిల్లా సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మహమ్మద్ షేక్ నిసార్ అహ్మద్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్లోని రెవెన్యూ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. పాత పింఛన్ విధానం పునరుద్ధరణ కోసం షేక్ నిసార్ అహ్మద్ చేస్తున్న పోరాటాన్ని స్థితప్రజ్ఞ ప్రశంసించారు.
News September 19, 2025
GDK: లాభాల వాటా ప్రకటించరా?: TBGKS

సింగరేణి లాభాల వాటా ప్రకటించకపోవడంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే వాటా ప్రకటించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు వాటా ప్రకటించకపోవడం ఏంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సంఘం శ్రేణులు పాల్గొన్నారు.
News September 19, 2025
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్కు పదోన్నతి

రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్కు సైతం పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. తిరిగి యధా స్థానంలో అదనపు ఎస్పీగా కొనసాగనున్నారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.