News February 9, 2025

నేడు ఆత్మకూరుకు రానున్న ఐదుగురు మంత్రులు  

image

నేడు(ఆదివారం) ఆత్మకూరులో ఐదుగురు మంత్రుల బృందం పర్యటిస్తున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. మంత్రులు ఫరూక్, సవిత, బీసీ జనార్దన్, నారాయణ వారిలో ఉన్నారు. టిడ్కో నివాస ప్రాంతాల్లో సీతారామ ఆలయ నిర్మాణం, పంచాయతీరాజ్ నూతన అతిథి భవన నిర్మాణానికి శంకుస్థాపన, R&B నూతన అతిథిగృహ ప్రారంభం, జ్యోతిరావు ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను వారు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  

Similar News

News December 7, 2025

నెల్లూరు: సిమ్ కార్డుతో మోసాలు

image

ఇతరుల వద్ద ఫోన్ తీసుకొని సిమ్ కార్డులను మారుస్తూ, ఓటీపీల సాయంతో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు. గతనెల 29న అందిన ఫిర్యాదు మేరకు SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో దర్యాప్తు సాగిందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శేషయ్య ఓటీపీల సహాయంతో వచ్చిన డబ్బులను బెట్టింగ్ యాప్‌లకు వాడినట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఇతని వద్ద రూ.2,60,000 రికవరీ చేసినట్లు తెలిపారు.

News December 6, 2025

పెంచలకోనలో విశేష పూజలు

image

రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

News December 6, 2025

Way2News ఎఫెక్ట్.. స్పందించిన బుచ్చి ఛైర్ పర్సన్

image

బుచ్చి మున్సిపాలిటీ మలిదేవి బ్రిడ్జి వద్ద గోతులు ఏర్పడి రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో <<18484228>>’500 మీటర్లలో.. లెక్కలేనన్ని గుంతలు’ <<>>అనే శీర్షికన Way2Newsలో కథనం ప్రచురితమైంది. స్పందించిన బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి మలిదేవి బ్రిడ్జి వద్ద రోడ్డుపై తాత్కాలిక మరమ్మతులను శనివారం చేపట్టారు. వాహనదారులు ప్రయాణికులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.